మేకప్ ఆర్టిస్టుతో స్టార్ హీరోయిన్ సరాగాలు!

బిజీ షెడ్యూళ్లతో నిరంతర ఒత్తిడుల నుంచి బయటపడేందుకు ఏం చేయాలి? ఏం చేయాలో సమంతనే అడగాలి. తాజాగా ఈ భామ  తన `సూపర్ బిజీ డే` సరదా గూఫీ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. దాదాపు 2 కోట్ల 30లక్షల (23 మిలియన్ల) మందికి పైగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లలో ఈ ఫోటోలు హల్చల్ చేసాయి.

సామ్ ఈ ఫోటోగ్రాఫ్స్ లో తన మేకప్ ఆర్టిస్టు సాధనా సింగ్ తో కనిపించింది. ఆ ఇద్దరూ ఎంతో సరదా సమయాన్ని గడిపారు. మునుపటితో పోలిస్తే సామ్ ఇప్పుడు నెమ్మదిగా తేరుకుని ఆనందమయ జీవితంలోకి ప్రవేశించిందని అర్థమవుతోంది. ఆ ఛామ్ మెరుపు ఇప్పుడిప్పుడే ముఖంలో స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలకు సమంత ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. “మేము చాలా బిజీగా గడిపాం… మేడ్ ఇట్ ఫ్రం కోచ్ టు ది బెడ్“ అంటూ వెల్లడించింది.

మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ సమంత ఇంట్లో సెలవు దినాన్ని ఆస్వాధిస్తూ ఒక సహచరిలా కలిసిపోయి కనిపించింది. రిలీజ్ చేసిన ఫోటోషూట్ లో ఆ ఇరువురి నడుమా ఉల్లాసం కనిపిస్తోంది. స్నేహంలో మాధుర్యం కూడా కనిపిస్తోంది. సామ్ తన వ్యక్తిగత సహాయకులతో ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. వారి బాగోగులను కూడా చూసుకునే మంచి మనసున్న రాణి అని తనతో పని చేసిన వారంతా చెబుతుంటారు. వ్యక్తిగత స్టైలిష్ట్.. మేకప్ ఆర్టిస్ట్.. డ్రైవర్ ఇలా అందిరతో సామ్ ఎంతో స్నేహంగా ఉంటారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సమంత గత చిత్రం `కాతు వాకులా రెండు కాదల్` సంతృప్తికర ఫలితాన్ని అందించింది. చివరిగా నయనతార- విజయ్ సేతుపతి- సమంత ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

మరోవైపు సామ్ నటిస్తున్న `యశోద` చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. `శాకుంతలం` విడుదల కోసం ఎదురుచూస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న `ఖుషీ` షెడ్యూళ్లు కొనసాగుతున్నాయి.  రెండవ షెడ్యూల్ జూన్ 8 నుండి ప్రారంభం కానుంది.

అలాగే అవెంజర్స్ మేకర్స్ రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న `సిటాడెల్`లోనూ సామ్ నటిస్తోంది. వరుణ్ ధావన్- సమంత ప్రధాన పాత్రల్లో రాజ్ నిడిమోరు -కృష్ణ డికె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. జూలై నుంచి ఈ సిరీస్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఫ్యామిలీమ్యాన్ 2 తర్వాత సామ్ కి రాజ్ అండ్ డీకేతో అద్భుత అవకాశమిది. బాఫ్టా-విజేత దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్న చిత్రం `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్`తో సమంత హాలీవుడ్ లోకి  అడుగుపెట్టనుంది.

About the Author

Leave a Reply

*