మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సరైనదే @ హరికృష్ణ

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సరైనదే :

 

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సరైనదే @ హరికృష్ణ

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సరైనదే @ హరికృష్ణ


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం సరైనదేనని సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ అన్నారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం స్పందించారు.

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టిందని… తెలుగు ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో పోరాడారన్నారు. మున్ముందుకూడా ఇదే తరహా పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-two-legends/

About the Author

Related Posts

Leave a Reply

*