మోడీ సర్కార్ కి ‘ద్రవ్యోల్బణం’ దెబ్బ !
మోడీ సర్కార్ కి ‘ద్రవ్యోల్బణం’ దెబ్బ:
తాజాగా గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు.. ద్రవ్యలోటు రూ.7.17 లక్షల కోట్లుగా నమోదైంది.. తగ్గుతున్న ఆదాయం.. పెరుగుతున్న వ్యయం ద్రవ్యలోటు లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తామన్న విషయం తెలిసిందే.

‘ద్రవ్యోల్బణం’ దెబ్బ
ఈ ఏప్రిల్-నవంబర్ వ్యవధిలో ద్రవ్యలోటు 114.8 శాతాన్ని తాకింది. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును రూ.6.24 లక్షల కోట్లకు కట్టడి చేస్తామని ఈ ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం
గత ఆర్థిక సంవత్సరం (2017-18) జీడీపీలో నవంబర్ ముగిసే నాటికి ద్రవ్యలోటు 112 శాతంగా ఉన్నది. నిరుడు ద్రవ్యలోటును 3.53 శాతానికి మోదీ సర్కారు కట్టడి చేసిన సంగతి విదితమే.

మోదీ సర్కారు
ఇదిలావుంటే ఈ నవంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వ ఆదాయం రూ.8.7 లక్షల కోట్లుగా ఉన్నట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తెలియజేసింది. అలాగే మొత్తం వ్యయం రూ.16.13 లక్షల కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నది. కాగా, మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17.25 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా అంచనా వేసింది. వచ్చే ఏడాది మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది.
ఈ క్రమంలో జీఎస్టీ సరళతరం పేరుతో ఎగువ శ్లాబుల్లోని వస్తు, సేవలను దిగువ శ్రేణుల్లోకి కేంద్రం మారుస్తుండటం కూడా రెవిన్యూ వసూళ్లను ప్రభావితం చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈసారి పన్నుల ద్వారా ఆదాయం 57 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయ లక్ష్యసాధన ఈసారి అంత సులువేమీ కాదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Read Also: https://www.legandarywood.com