మోడీ సర్కార్ సంచలన నిర్ణయం రూ.2 వేల నోటు రద్దు లీకులు !
మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం రూ.2 వేల నోటు రద్దు లీకులు :
మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా పావులు కదుపుతుంది. మోడీ సర్కార్ రూ.2 వేల నోటును నిషేధించనున్నారనే వార్త లీకులు ఇస్తున్నారు. అదేసమయంలో దాని స్థానంలో రద్దుచేసిన రూ.వెయ్యి నోటును తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సర్కార్ సంచలన నిర్ణయం
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానిప్రకారం డిసెంబర్ చివరినాటికి రూ. 2వేల నోట్లను రద్దు చేస్తుంది. అందుకు ప్రజలకు 10 రోజులే గడువు ఇవ్వనుంది. అంటే కేవలం పది.. పదిహేను రోజుల్లో ప్రజలంతా తమదగ్గరున్న సదరు రద్దు నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలి.

రూ.2 వేల నోటు రద్దు లీకులు
బ్యాంకులు కూడా రూ 50 వేల విలువైన నోట్లను మాత్రమే తీసుకుంటాయి. అంటే అందరు 25 రెండువేల రూపాయలను మాత్రమే జమచేయగలుకుతారని ఆ వీడియో సారాంశం. జనవరి ఒకటో తేదీ నుంచి ఎటిఎం యంత్రాల్లో కొత్త నోట్లను లోడ్ చేయటానికి ఏర్పాటులు చేస్తున్నారు ఇది అసలు విషయం.

సంచలన నిర్ణయం దిశగా పావులు
నోట్ల రద్దు ద్వారా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇతర పార్టీల్లో నగదు లేకుండా చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని స్కెచ్ వేస్తున్నట్లు టాక్.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు
అయితే ఈ వీడియో గత ఏడాది కాలంగా యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. ఈ విషయం గురుంచి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రస్తుతం రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచన లేదని చెప్పారు. అలాగే, రూ.1000 నోటుని తిరిగి ప్రవేశపెట్టే ఉద్దేశ్యం లేదని చెప్పారు.
Read Also : http://www.legandarywood.com/