రామ్ విలాస్ పాశ్వాన్ జోస్యం చెప్పారు..
కాంగ్రెస్ నుంచి బీజేపీ నేర్చుకోవాలి :

రామ్ విలాస్ పాశ్వాన్ జోస్యం చెప్పారు
కేంద్ర మంత్రి, ఎన్నికల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉంటాయనే విషయంలో ముందుగానే ఊహించి ఖచ్చితంగా చెప్పడంలో ఆయనకు ఆయనేసాటి. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ కూడా అంత ఖచ్చితంగా చెప్పలేవు. కానీ, రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారంటే ఖచ్చితంగా ఆ విధంగానే జరిగితీరుతుంది.
గతంలోనూ పాశ్వాన్ ఎవరు విజేత కాగలరన్న విషయంలో ముందస్తు అంచనాలు వేసుకుని కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సందర్భాలున్నాయి. అటువంటి నేత కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూనే ఇలా వ్యాఖ్యానించడం వెనుక తగినంత అర్థం ఉంటుందంటున్నారు.
‘సమ్మిళిత సమాజాన్ని నిర్మించడం ఎలాగన్నది’ కాంగ్రెస్ నుంచి బీజేపీ నేర్చుకోవాలని పాశ్వాన్ ప్రకటించడంతో ట్విట్టర్లో ఎంతో మంది దీనిపై స్పందించారు. అత్యంత ఖచ్చితమైన వాతావరణ అంచనా వేయగల వ్యక్తిగా ఆయన్ను అభివర్ణిస్తూ ట్వీట్లు పెట్టేస్తున్నారు.
పాశ్వాన్ భారతదేశంలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన నిపుణుడు. అంచనాలు వేయడంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. పాశ్వాన్ అత్యంత అధునాత వాతావరణ అంచనాలు వేసే భారత దేశ శాటిలైట్. మోడీ నిజంగా ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే రామ్ విలాస్ పాశ్వాన్ కంటే ఏ పోల్ ఏజెన్సీ కూడా ఎన్నికల ఫలితాలను అంత ఖచ్చితంగా అంచనా వేయలేదు’ అంటూ ట్విట్టర్లో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Read Also : http://www.legandarywood.com/pics-bold-beauty-disha-pathani-latest-poses/