రియల్ ‘చైతన్యరథం’పై.. రీల్ ‘అన్నగారు’ !
రియల్ ‘చైతన్యరథం’పై.. రీల్ ‘అన్నగారు’ :
నటసింహం బాలయ్య । క్రిష్ క్రేజీ కాంబినేషన్లో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా… మొదటిది ‘కథానాయకుడు’, రెండోది ‘మహానాయకుడు’ విడుదలవుతున్న విషయం మనకు విదితమే.

చైతన్యరథం
లేటెస్టుగా ‘మహానాయకుడు’ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించిన సమయంలో చైతన్యరథం పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పర్యటించిన విషయం విదితమే. ఈ ఫోటోలో బాలయ్య ఖాకీ దుస్తులు ధరించి చైతన్య రథంపైన అచ్చుగుద్దినట్టుగా అన్నగారిలాగానే నిలబడి ఉన్నాడు.

మహానాయకుడు
కుడి చేత్తో మైకు పట్టుకున్న ఆయన ఎడమ చేతిని ‘అన్నగారి’ ట్రేడ్ మార్క్ స్టైల్ లో అలా పైకెత్తి చిరునవ్వులు చిందిస్తూ స్పీచ్ ఇస్తున్నారు.

ట్రేడ్ మార్క్ స్టైల్
ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించిన 6 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చారు. ‘మహానాయకుడు’ లో ఈ ఎపిసోడ్ కు దర్శకుడు క్రిష్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మన రీల్ అన్నగారు ఏం చేశారో చూడాలంటే సినిమా రిలీజ్ ఫిబ్రవరి 7 వరకు ఆగాల్సిందే.
Read Also: https://www.legandarywood.com