రూపాయి పతనం కాకుండా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి !
రూపాయి మరింత క్షీణించే అవకాశం :
అతిపెద్ద చమురు దేశమైన ఇరాన్ తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుని అమెరికా ఆంక్షలకు దిగడం, అవసరానికంటే తక్కువ చమురు ఉత్పత్తి పెంపునకే ఓపెక్ అంగీకరించడం వంటి అంశాలతో రూపాయిపై ప్రభావం పడకుండా ఆర్ బీఐ చర్యలు తీసుకోవాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు,

రూపాయి మరింత క్షీణించే అవకాశం
ఆర్ బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ పరస్పరం కలసి రూపాయి ప్రస్తుత విలువల నుంచి ఇంకా పతనం కాకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ కోరింది.
డాలర్ తో రూపాయి 69 సమీప స్థాయి వరకూ వెళ్లిన నేపథ్యంలో అసోచామ్ స్పందించింది. పెరిగే చమురు ధరలతో రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ మారకం నిల్వలు దండిగా ఉన్నందున రూపాయి అస్థిరతకు చెక్ పెట్టాలని కోరింది. అలాగే, ఎగుమతులను పెంచేందుకు వాణిజ్య శాఖ ఎగుమతిదారులకు ప్రోత్సాహం అందించాలని కోరారు.
Read Also : http://www.legandarywood.com/photo-story-loafer-beauty-latest-bikini-poses/