రెండేళ్ళ కనిష్టానికి బిట్ కాయిన్, క్రిప్టో మహా పతనం ఎందుకంటే?

క్రిప్టో కరెన్సీ దారుణంగా పతనమైంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టోలైన బిట్ కాయిన్ ఏకంగా 22,500 డాలర్ల దిగువకు, రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 1200 డాలర్ల దిగువకు పడిపోయాయి. మీమ్ కాయిన్స్ షిబా ఇను 0.000008 డాలర్లకు, డోజీకాయిన్ 0.055707 డాలర్లకు క్షీణించింది. క్రిప్టో కరెన్సీ క్రితం సెషన్‌లో అత్యంత దారుణ పతనాన్ని నమోదు చేసింది. నేడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది.

2020 డిసెంబర్ తర్వాత బిట్ కాయిన్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ నేడు 7.00 శాతం క్షీణించి 22,490 డాలర్ల వద్ద కదలాడింది.

52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 20,834.50 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో 20,834 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 24,288 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో బిట్ కాయిన్ భారీగా పతనం కావడంతో దీని ఆల్ టైమ్ గరిష్టం నుండి 66 శాతం క్షీణించగా, కేవలం 2022 క్యాలెండర్ ఏడాదిలోనే 50 శాతం వరకు పతనమైంది.

వివిధ క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 7 శాతం, ఎథేరియం 4 శాతం, బియాన్స్ కాయిన్ 1.3 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 0.34 శాతం, బియాన్స్ యూఎస్డీ 0.140 శాతం, ఎఫ్‌టీఎక్స్ టోకెన్ 6 శాతం, రాప్డ్ 7 శాతం, ట్రోన్ 6.20 శాతం, పాలీగోన్ 1.6 శాతం నష్టపోయాయి. డోజీకాయిన్ 1.6 శాతం, షిబా ఇను 5.13 శాతం లాభపడ్డాయి.కొన్ని క్రిప్టోలు మాత్రం పరుగు పెట్టాయి. స్కేల్ 20 శాతం, లో టెక్స్ 16 శాతం, బిట్ కాయిన్ ఎస్వీ 16 శాతం, క్వాంట్ 15.15 శాతం, ఫాంటోమ్ 15 శాతం నష్టపోయాయి. భారీగా నష్టపోయిన వాటిలో మోనెరో 12 శాతం, రాప్డ్ బిట్ కాయిన్ 7.23 శాతం, జెడ్ క్యాష్ 7.17 శాతం, బాంకోర్ 7 శాతం క్షీణించాయి.

బిట్ కాయిన్ సహా క్రిప్టో మార్కెట్ పతనానికి యూఎస్ క్రిప్టో కరెన్సీ లెండింగ్ కంపెనీ సెల్సియస్ నెట్ వర్క్ ఉపసంహరణలను, ట్రాన్సుఫర్స్‌ను ఫ్రీజ్ చేసింది. ఎక్స్‌ట్రీమ్ మార్కెట్ కండిషన్స్ పేరిట ప్రీజ్ చేసింది. దీంతో క్రిప్టో మార్కెట్ నిన్న దారుణంగా పతనమైంది.

About the Author

Leave a Reply

*