లవ్.. లక్ రెండు రెండూ ఒకేసారి తలుపు తట్టాయి !

బ్రదర్.. లైఫ్ లో లవ్.. లక్ రెండు :

కొందరు స్టార్ హీరోలు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంటారు. కానీ.. షారూక్ మాత్రం అందుకు భిన్నం. చిలిపిగా సమాధానాలు ఇవ్వటం.. తేడా వస్తే అంతే కటువుగా బదులివ్వటంలో ఆయనకు ఆయనే సాటి. తెర మీద ఫుల్ రొమాన్స్ అన్నట్లు వ్యవహరించే షారూక్.. తెర వెనుక మాత్రం ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా చెబుతారు,

 

బ్రదర్.. లైఫ్ లో లవ్.. లక్ రెండు

బ్రదర్.. లైఫ్ లో లవ్.. లక్ రెండు

 

తాను నచ్చి… మెచ్చి మరీ పెళ్లాడిన గౌరీతోనూ… పిల్లలతో గడిపేందుకు షారూక్ ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. చాలా చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకున్న షారుక్ ను చాలామంది ఆయన పెళ్లి గురించి చాలానే అడగాలనుకుంటారు.

తాజాగా ఆ పని చేశాడో అభిమాని. ఇన్ స్టాగ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన ఒక ఫీచర్ లో యూజర్ నుప్రశ్నించే వీలుంది. అయితే.. దీన్ని 24 గంటల్లో తొలగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అభిమాని ఒకరు ఆసక్తికర క్వశ్చన్ ను సంధించారు. మరీ..  కుర్ర వయసులోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారన్న ప్రశ్నకు  షారుక్ స్పందించారు.

కాస్తంత చిలిపిగా సమాధానం ఇచ్చిన ఆయన.. బ్రదర్.. లైఫ్ లో లవ్.. లక్ రెండు కలిసి ఒకేసారి తలుపు కొట్టొచ్చు. అదే రీతిలో నాకు గౌరీ రూపంలో రెండూ ఒకేసారి వచ్చి తలుపు తట్టాయి. అందుకే.. చాలా త్వరగా పెళ్లి చేసేసుకున్నా అంటూ ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. పెళ్లి అయిన ఇన్నాళ్లకు సైతం భార్య మీద షారుక్ ప్రదర్శిస్తున్న ప్రేమాభిమానాల్ని భలేగా ప్రదర్శించేశాడు కదూ!

 

Read Also : http://www.legandarywood.com/trailer-lover-movie-teaser/

About the Author

Related Posts

Leave a Reply

*