వరల్డ్ మ్యాప్‌లో ఈ 7 దేశాలు మిస్సింగ్.. కనీసం పేర్లు కూడా చాలా మందికి తెలియదు

మీరు ప్రపంచ పటాన్ని (World Map) చూసే ఉంటారు. ఏ దేశం ఎక్కడుందో అందులో క్లియర్‌గా ఉంటుంది. చిన్నప్పుడు సోషల్ సబ్జెక్టులో వరల్డ్ మ్యాప్‌ గురించి పాఠాలు ఉంటాయి. ఒక దేశం పేరు ఇస్తే.. దానిని ప్రపంచ పటంలో గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. స్కూల్ లైఫ్ తర్వాత కూడా మీరు ఎన్నోసార్లు వరల్డ్ మ్యాప్స్ చూసి ఉంటారు. రంగురంగుల్లో దేశాలు, వాటి రాజధానుల వివరాలు మనకు కనిపిస్తాయి. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉన్నాయి. ఇందులో 193 దేశాలు ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉండగా.. మిగతా రెండు సభ్యులు కానివి. మధ్యలో అనేక ఇతర దేశాలు కూడా ఈ జాబితాలో చేరుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచ పటంలో కనిపించని కొన్ని దేశాలు ఉన్నాయి. అలాంటి మొత్తం 7 దేశాలు ఉన్నాయి. ఇవి ఏ ప్రపంచ పటంలోనూ కనిపించవు. వాటి గురించి చాలా మందికి తెలియదు. అసలు పేర్లను కూడా విని ఉండరు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ దేశాలు ప్రపంచంలోని ఏ మ్యాప్‌లోనూ కనిపించవు

ట్రాన్స్‌నిస్ట్రియా (Transistria): ఈ దేశం 1990లో ఏర్పడింది. ఇంతకుముందు ఇది చిసినావులో ఉండేది. ఈ దేశం ప్రపంచ పటంలో కనిపించదు. ఐనప్పటికీ ట్రాన్స్‌నిస్ట్రియా దేశం స్వంత ప్రత్యేక సైన్యం, కరెన్సీ జెండాను కలిగి ఉంది.

సోమాలిలాండ్ (Somaliland): 1991లో సోమాలియాలో అకస్మాత్తుగా హింస చెలరేగింది. దీని తరువాత సోమాలియా వాయువ్య భాగం స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే సోమాలిలాండ్ ఏర్పడింది. ఈ దేశం దాని స్వంత జెండా, కరెన్సీని కూడా కలిగి ఉంది.

ఇరాకీ కుర్దిస్తాన్ (Iraqi Kurdistan): ఈ ఇరాకీ కుర్దిస్తాన్ స్వతంత్ర దేశం 1970లో ఏర్పడింది. ఇది ఇరాక్ దేశం లోపలే ఉంటుంది. ఇరాకీ కుర్దిస్తాన్.. ఇరాక్ లోపల ఉన్నప్పటికీ దాని స్వంత ప్రత్యేక సైన్యం, ప్రభుత్వం, సరిహద్దు కూడా ఉంది. ఆ దేశం ఈ వరల్డ్ మ్యాప్‌లోనూ కనిపించదు.

వెస్ట్రన్ సహారా (western Sahara): సహారా ఎడారి గురించి చాలా మందికి తెలుసు. ఆఫ్రికాలోనే అతి పెద్ద ఏడారి. పశ్చిమ సహారా దేశం మాత్రం ప్రపంచానికి తెలియని దేశంగా ఉండిపోయింది. ఇది ఆఫ్రికన్ యూనియన్‌లో భాగం. ఎన్నో ఏళ్లుగా స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఈ దేశం ఏ ప్రపంచ పటంలోనూ లేదు.

అబ్ఖాజియా (Abkhazia): ఈ దేశం గతంలో జార్జియాలో భాగంగా ఉండేది. కానీ సోవియట్ యూనియన్ పతనం తరువాత.. స్వాతంత్య్రాన్ని కోరుకుంది. ఎన్నో పోరటాల తర్వాత.. 1993లో స్వాతంత్ర్యం సాధించి.. దేశంగా అవతరించింది. ఇది కూడా ఏ ప్రపంచపటంలో కనిపించదు.

సెబోర్గా (Seborga): ఇటలీలోని వాటికన్ సిటీలో చాలా చిన్న దేశాలున్నాయి. కానీ ఆ మ్యాప్స్‌లో దేనిలోనూ సెబోర్గాకు చోటు లభించలేదు. ఇది న్యూయార్క్ సిటీ .. సెంట్రల్ పార్క్ అంత పరిమాణంలో ఉండే చాలా చిన్న దేశం.

పుంట్ ల్యాండ్ (Puntland): సోమాలియా నుండి సోమాలిలాండ్‌ను ఏ విధంగా ఏర్పడిందో.., అదే విధంగా పంట్‌ల్యాండ్ కూడా ఉంది. కానీ పుంట్‌ల్యాండ్‌ను ఎల్లప్పుడూ ISIS ఆక్రమణలో ఉంది. కరుడుగట్టిన ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్నప్పటికీ..పుంట్‌ల్యాండ్‌లో ఎల్లప్పుడూ శాంతి ఉంది.

About the Author

Leave a Reply

*