Previous Story
వాజపేయి ‘ముఖచిత్రం’తో రూ.100 కాయిన్ !
వాజపేయి ‘ముఖచిత్రం’తో రూ.100 కాయిన్:
మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఫొటోతో త్వరలో 100 రూపాయలతో నాణెం విడుదలకానుంది. ఈ నాణెంపై వాజ్‌పేయి ఫొటోతోపాటు అయన పుట్టిన, మరణించిన తేదీలు ఉంటాయి. ఈ కాయిన్‌పై వాజపేయి పేరును దేవనగరి లిపితోపాటు, ఆంగ్లంలో ముద్రించనున్నారు.

వాజపేయి ‘ముఖచిత్రం’
ఈ కాయిన్‌కు మరోవైపు, అశోక సారనాథ్ స్తంభాలైన నాలుగు సింహాలు ఉండనున్నాయి. దానికింద సత్యమేవ జయతే అన్న వాక్యం దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంటుంది. దాని కిందే “భారత్” అని నాణేనికి ఇరువైపులా లిఖించబడి ఉంటుంది. వాజ్‌పేయి గౌరవార్థం ఆయన పేరు మీద ప్రభుత్వం ఈ కాయిన్ తీసుకురాబోతోంది.

వాజ్‌పేయి గౌరవార్థం
ఇప్పటికే అయన పేరును ,ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయాపూర్ కు ‘అటల్‌నగర్’గా అక్కడి గత బీజేపీ ప్రభుత్వం మార్చింది కూడా.
Read Also: https://www.legandarywood.com