వాహనప్రియులకు ‘షాక్’ ఇచ్చిన టాటా !

వాహనప్రియులకు ‘షాక్’ ఇచ్చిన టాటా :

ప్రముఖ కంపెనీ టాటామోటార్స్ కూడా వాహనధరలను పెంచినట్టు ఈరోజు ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి తమ అన్ని మోడళ్లపై రూ.40,000 వరకు పెరుగుతాయని ఈరోజు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే టొయోటా, ఫోక్స్‌వేగన్‌, ఇసుజు, మారుతి సుజుకి, బిఎండబ్ల్యు తదితర సంస్థలు తమ వాహన ధరలు పెంచేశాయి.

 

వాహనప్రియులకు 'షాక్'

వాహనప్రియులకు ‘షాక్’


వాటి బాటలోనే టాటామోటార్స్ తమ వాహనాల అన్ని రూ.40వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.2019 జనవరి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి.

 

వాటి బాటలోనే టాటామోటార్స్

వాటి బాటలోనే టాటామోటార్స్

 

టాటా మోటార్స్‌ ప్రస్తుతం తక్కువ ధరలోని నానో నుంచి ఎస్‌యువిలో హెక్సా వరకు మోడళ్లను విక్రయించిస్తుంది. వీటి ధరలు రూ.2.36 లక్షల నుంచి రూ.17.97 లక్షలుగా విలువ చేస్తున్నాయి.పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, మారిన మార్కెట్‌ పరిస్థితులు తదితర ఇతర కారణాల నేపథ్యంలో ధరలు పెంచాల్సి వచ్చిందని టాటామోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీఖ్‌ తెలిపారు.

 

Read Also : https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*