‘విశాఖ’ కు ‘నేవీ’ చెక్ !

‘జగన్’ ‘కల’ల రాజధాని ‘విశాఖ’ కు ‘నేవీ’ చెక్ :

‘జగన్’ మోహన్ రెడ్డి ‘కల’ల రాజధాని ‘విశాఖ’, సరైన నిర్ణయమా అంటే ‘కాదు’ అని తాజా సంఘటనలు నిరూపిస్తున్నాయి… వైజాగ్ లోని మిలీనియం టవర్స్‌ను సచివాలయంగా చేసుకుని అక్కడి నుంచి పరిపాలన చేయాలనుకున్న జగన్ ఆలోచనకు నేవీ అభ్యంతరం తెలిపింది.

Millennium Tower in Vizag

 Millennium Tower in Vizag

 

ఈ మేరకు ‘డెక్కన్’ క్రానికల్ ‘పత్రిక’ ఓ ‘కథ’నాన్ని ‘ప్రచురించింది’… వైజాగ్ లోని రుషికొండ వద్ద మిలీనియం టవర్స్ ఉన్నాయి, దానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో INS కళింగ ఉంది.  తూర్పు నావికాదళానికి కేంద్రమైన విశాఖలో ఈ ఐఎన్ఎస్ కళింగ కీలక స్థావరం.

శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యమని… ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని తెలిపింది.  734 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న ఈ ఐఎన్ఎస్ కళింగలో అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది, సాంకేతికంగా అత్యున్నత స్థాయిగల మిసైల్స్‌కు ఈ ప్రాంగణం ఆధారం.  ఇలాంటి కీలకమైన ప్రాంతంలో జనసంచారం పెంచుకుంటూ పొతే అది భద్రతా పరమైన సమస్యలకు దారి తీస్తుందంటూ ఏపీ సర్కారుకు నేవీ లేఖ రాసింది.

Nevi check request to AP

   Nevi check request to AP

 

‘1980’ లలో అప్పటి ‘ఏపీ’ ప్రభుత్వం ‘నేవీ’కి 400 ఎకరాలను ‘కేటాయించింది’. ఇప్పటికీ నేవీకి | ఏపీ రెవిన్యూ శాఖకు మధ్య భూ వివాదం కొనసాగుతుంది, అలాగే న్యాయపరమైన చుక్కులు ఉన్నాయి.

తాజాగా నేవీ ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంది…. మరి ఈ బాలారిష్టాన్ని జగన్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తోందో ?

 

Read Also: https://www.legandarywood.com/jagan-continuously-cheating/

About the Author

Leave a Reply

*