విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలితమెలా ఉంటుంది

భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారం :

విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవము భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు. వాల్మీకి మహర్షి ప్రణీతమైన రామాయణము. శ్రీవేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్భారతము. శ్రీమద్భారతానికి రెండింటి వల్లనే గౌరవం అని పెద్దల యొక్క సూక్తి. అందులో మొదటిది శ్రీ కృష్ణ భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత రెండవది. భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన విష్ణు సహస్రనామ స్తోత్రము,

 

భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారం

భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారం

 

మొదటి దానిని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించాండు.రెండవ దానిని భారత సంగ్రామానంతరం అంపశయ్యపై పడియుండిన భీష్మపితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేసాడు.

ఈ రెండింటిలో భగవద్గీత కంటే విష్ణు సహస్ర నామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చని కృష్ణుని అభిమతం.

ఇందులో 108 శ్లోకాలున్నాయి.భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకు ఉన్న నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.అంటే 27 నక్షత్రాలు 4 చే భాగిస్తే వచ్చేది 108 ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే 108 పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి.

ఏ నక్షత్రంలో ఏ పాదానికి చెందినవారు ఆయా పాదసంఖ్య శ్లోకాన్ని తెలుసుకుని 11,21,41,54,108 సార్లు మీ వీలును బట్టి చదువుకోవాలి.మీ జన్మ నక్షత్రము ప్రకారము గానీ లేదా వ్యవహార నామం ప్రకారం గానీ చదువుకోవచ్చు.

మన నక్షత్ర పాదమునకు సంబంధించిన మత్రం చదువుకుంటే మన నక్షత్ర పాద దోషం నివారణ జరుగుతుంది.అదే విష్ణ సహస్ర నామాలు మొత్తం చదువుకుంటే అన్ని విషయాలలో అన్ని నక్షత్ర పాదాల వారితో అనుకూలంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ.

Source : Oneindia.com

Read Also : http://www.legandarywood.com/photo-shoot-katrina-kaif-latest-hot-poses/

About the Author

Leave a Reply

*