వైజాగ్ సహా నాలుగు టైర్ 2 నగరాల్లో ఇన్ఫోసిస్ కొత్త కార్యాలయాలు

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అందుబాటులోని టాలెంట్ పూల్‌కు దగ్గరగా ఉండేందుకు టైర్ 2 నగరాల్లో నాలుగు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ ఓ ఇంగ్లీష్ మీడియాకు తెలిపారు. ఐటీ రంగంలో చాలామంది యువ ఉద్యోగులు టైర్ టూ నగరాల నుండి ఐటీ రంగంలోకి రిక్రూట్ అయ్యారని, ఇందులో 60 శాతం మంది తమ తమ ఇళ్లకు వెళ్లారని, అయితే తమ తాజా కొత్త కార్యాలయాల ఏర్పాటు కారణంగా వారికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం తమ ఉద్యోగుల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నారు. అన్నింటిని గమనిస్తున్నామని, వచ్చే త్రైమాసికం నాటికి తమ కార్యాలయాలు సిద్ధంగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే ఈ కంపెనీకి ఇండోర్, నాగపూర్‌లలో చిన్న కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు కోయంబత్తూరు, వైజాగ్, కోల్‌కతా, నోయిడాలలో ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ నగరాలు భవిష్యత్తులోను ప్రతిభకు కేంద్రాలుగా ఉంటాయని, అందుకే అక్కడ మేము పెట్టుబడులను కొనసాగిస్తున్నామని, దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్తామన్నారు. కాగా, టైర్ టూ నగరాలకు వెళ్లే కంపెనీల ట్రెండ్ అంతటా కనిపిస్తోంది. ఈ నగరాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కనిపిస్తున్నాయని ఐటీ ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్‌కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ సంగీతా గుప్త అన్నారు.

About the Author

Leave a Reply

*