శ్రీముఖిని మీరు చేసుకుంటారా?

శ్రీముఖిని మీరు చేసుకుంటారా? :

 

శ్రీముఖితో డేటింగ్‌

శ్రీముఖితో డేటింగ్‌

 

పటాస్ షో యాంకర్స్ శ్రీముఖి, రవిల మధ్య ఏదో సాగుతోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న సంగతి తెలిసింది. ఈ వ్యవహారంపై యాంకర్ రవి ఇంటర్వ్యూలో నిజమేంటో చెప్పేశాడు. శ్రీముఖితో డేటింగ్‌లో వున్నారని.. త్వరలో ఆమెతో వివాహం జరుగనుందనే వార్తలపై ఏమంటారనే ప్రశ్నకు ఇంటర్వ్యూలో రవి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.


‘అవునండి.. పిల్లలున్నారని.. ఒకడు పదో క్లాస్ చదువుతున్నాడు. హాస్టల్‌లో వుంటున్నాడు’ అంటూ చెప్పాడు. కామన్సెస్ లేకుండా ఇలాంటి వదంతులు వస్తున్నాయని రవి కొట్టి పారేశాడు. వ్యూవర్ షిప్ కోసమే ఇదంతా జరుగుతుందని నలుగురు కలిస్తే.. ఒకరు శ్రీముఖి, రవి మొగుడుపెళ్లాం అంటే.. కాదు యాంకర్ల వరకేనని మరొకడు అంటాడు. ఫ్రెండ్స్ అని మరొకడు, లవర్స్ అని వేరొకడు అంటారు. అయితే ఆ నలుగురు అలా మాట్లాడుకుంటారు. అంతటితో ఆగకుండా పటాస్ షో చూస్తారు.


దీంతో వ్యూవర్‌షిప్ వస్తుందని.. అలాంటప్పుడు మా మధ్య ఏముందనే దానిపై ఎందుకు క్లారిటీ ఇస్తాం. వ్యూవర్‌షిప్ సాధించడంలో తాము సక్సెస్ అయినట్టేగా అంటూ రవి కామెంట్ చేశాడు. ఇప్పటికే శ్రీముఖితో ప్రేమాయణం లేదని సోషల్ మీడియా ద్వారా చెప్పేశానన్నాడు.


అయితే శ్రీముఖితో మీకు వివాహం అయినట్లే సోషల్ మీడియాలో ఫ్రూఫ్ వుందని ఇంటర్వ్యూ చేసే మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు రవి ఇలా సమాధానమిచ్చాడు. శ్రీముఖితో వివాహం కాలేదని ఫ్రూఫ్ చేస్తే మీరు చేసుకుంటారా? అని ఎదురు ప్రశ్న వేశాడు.

 

Read Also : http://www.legandarywood.com/photos-shraddha-srinath-tempting-looks-tfm/

About the Author

Related Posts

Leave a Reply

*