సుకన్య సమృద్ధి యోజన బ్యాంకు నుండి పోస్టాఫీస్ లేదా మరో బ్యాంకుకు బదలీ ఇలా

సుకన్య సమృద్ధి యోజన(SSY) పథకాన్ని బ్యాంకు నుండి పోస్టాఫీస్‌కు బదలీ చేసుకోవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకం SSY. పదేళ్ల లోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ ఖాతాను పోస్టాఫీస్ లేదా నిర్దిష్ట బ్యాంకుల్లో తెరువవచ్చు. అలాగే బ్యాంకు నుండి పోస్టాఫీస్‌కు లేదా పోస్టాఫీస్ నుండి బ్యాంకుకు లేదా బ్యాంకు నుండి మరో బ్యాంకుకు కూడా బదలీ చేసుకోవచ్చు.

ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు ఖాతాను ఉచితంగా బదలీ చేసుకోవచ్చు. ఒకవేళ పోస్టాఫీస్ నుండి బ్యాంకుకు బదలీ చేసుకుంటే రూ.100 ఛార్జీ ఉంటుంది. ఏడాదిలో ఒకసారి ఖాతాను బదలీ చేసుకునే వెసులుబాటు ఉంది. బ్యాంకు నుండి పోస్టాఫీస్‌కు ఖాతాను బదలీ చేసుకోవడానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. మొదట మీరు ఖాతాను బదలీ చేసుకోవడానికి ఫామ్ ఫిల్-అప్ చేయాలి.

ఖాతా బదలీ కోసం ముందుగా మీరు ఖాతా తెరిచిన బ్యాంకు బ్రాంచీ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ట్రాన్స్‌ఫామ్ కోసం విజ్ఞప్తి చేయాలి. బ్యఆంకు లేదా పోస్టాఫీస్ మీకు బదలీ ఫామ్ ఇస్తారు. దీనిని పూర్తి చేయాలి. బదలీ ఫామ్ పూరించేటప్పుడు ఖాతా బదలీ చేయబోయే బ్యాంకు లేదా పోస్టాఫీస్ పేరు, చిరునామా తప్పనిసరిగా అభ్యర్థన ఫామ్‌లో వెల్లడించాలి.

తర్వాత ఈ ఫామ్‌తో పాటు పాస్‌బుక్‌ను సమర్పించాలి. ఖాతా బదలీ కోసం ఒరిజినల్ పాస్‌బుక్‌ను అందచేయాలి. ప్రస్తుత బ్యాంకు లేదా పోస్టాఫీస్ మీరు సమర్పించిన ఫామ్‌ను, ఇతర పత్రాలను ధృవీకరించి, ఖాతా బదలీ ప్రాసెస్‌ను పూర్తి చేస్తుంది. బ్యాంకులో ఖాతాను మూసివేసి, సంబంధిత అన్ని పత్రాలను కొత్త అడ్రస్‌కు పంపిస్తుంది.

కొన్ని సందర్భాల్లో కస్టమర్‌కు అందిస్తారు. పత్రాలు వచ్చాక కొత్త అడ్రస్‌లో ఖాతా తెరిచి సంబంధిత పాస్‌బుక్ ఖాతాదారునికి అందిస్తుంది. కొన్ని బ్యాంకులు కొత్త దరఖాస్తు ఫామ్‌తో పాటు కేవైసీ పత్రాలను కోరుతాయి. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాలు ఖాతాదారుని ఫోటోగ్రాఫ్, గార్డియన్ ఆధార్ కార్డు, గార్డియన్ పాన్ కార్డు, పాప పుట్టిన తేదీ పత్రం, కేవైసీ పత్రాలు అవసరం.

About the Author

Leave a Reply

*