సూపర్ స్టార్ సేవలలో కార్పోరేట్ హస్తం !

ఏమిటి అంటూ గతంలో విమర్శలు :

మహేష్ నటించే ఒకొక్క సినిమాకు 20 కోట్ల పారితోషికం తీసుకునే మహేష్ ఇలా దాతల వద్ద డొనేషన్స్ తీసుకోవడం ఏమిటి అంటూ గతంలో విమర్శలు కూడ వచ్చాయి. ఇది ఇలా ఉండగా మహేష్ ఈమధ్య ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ నుండి తాను చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం 25 లక్షలు విరాళంగా తీసుకున్నాడు అని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి,

 

ఏమిటి అంటూ గతంలో విమర్శలు

ఏమిటి అంటూ గతంలో విమర్శలు

 

శ్రీమంతుడు సినిమాలో నటించిన మహేష్ గ్రామాలను దత్తత తీసుకోవాలని సందేశాలు ఇచ్చాడు. మహేష్ స్పూర్తితో ఎంతోమంది ఎన్నో గ్రామాలను మన తెలుగు రాష్ట్రాలలో దత్తత తీసుకుని తమతమ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మహేష్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడు.

తెలంగాణలోని సిద్దాపురం గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ ఆ రెండు గ్రామాలను చెప్పుకోతగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. బాబు ఏ మేరకు అభివృద్ది చేసాడన్నదానిపై పలు విమర్శలు వున్నాయి. ముఖ్యంగా బుర్రిపాలెం విషయంలో మొక్కలకు కంచెలు వేయడానికి పలువురు దాతల సాయం తీసుకున్నాడని వార్తలు వున్నాయి.

దీనితో మహేష్ తన పలుకుబడి ఉపయోగించి సేకరించిన విరాళాలతో తాను దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధి ఏమిటి అంటూ విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి. సంపాదించింది ఎంతో కొంత తన ఊరికి ఇవ్వకపోతే లావు అయిపోతారు అని మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమాలో డైలాగ్ విసిరాడు. అయితే దీనికి భిన్నంగా మహేష్ కార్పోరేట్ కంపెనీల సహాయంతో సమాజ సేవ చేయడం ఏమిటి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

 

Read Also : http://www.legandarywood.com/miss-world-flaunting-cleavage-going-viral/

About the Author

Related Posts

Leave a Reply

*