సూర్య సరసన చెన్నై చిన్నది
కోలీవుడ్‌లో అవకాశాల పంట :
కొత్త సినిమాల అవకాశాలను సొంతం చేసుకుంటోంది ఈ పసిడిమేని ఛాయల చిన్నది. తమ్ముడు కార్తితో నటించిన కథానాయికలు తప్పకుండా అన్న చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటారన్న ప్రచారం కోలీవుడ్‌లో ఉంది. ఆ విషయాన్ని సాయేషా మరో మారు నిజం చేస్తోంది. అవును.. కేవీ ఆనంద్ దర్శకత్వంలోని చిత్రంలో సూర్య సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది,

కోలీవుడ్‌లో అవకాశాల పంట
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో జయంరవి నటించిన ‘వనమగన్’తో గుర్తింపు తెచ్చుకున్న సాయేషాకు ప్రస్తుతం కోలీవుడ్‌లో అవకాశాల పంట పండుతోంది. కార్తితో నటించిన ‘కడైకుట్టి’ సింగం త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు ఆర్యతో నటించిన ‘గజినికాంత్’ కూడా విడుదలకు సిద్ధమైంది.
విజయ్ సేతుపతితో నటించిన ‘జూంగా’ కూడా ఒకట్రెండు నెలల వ్యవధిలోనే తెరపైకి రానుంది. మొత్తానికి మరో రెండు నెలల్లో మూడు పెద్ద సినిమాల ద్వారా ఈ అమ్మడు ప్రేక్షకులను పలకరించనుంది.
ఈ చిత్రంలో మోహన్‌లాల్, అల్లు శిరీష్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ గుణచిత్ర నటుడు బోమన్ ఇరాని కూడా ఇందులో చేరారు.
Read Also : http://www.legandarywood.com/wedding-bells-another-beauty-soon/