స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా ఆఫర్లు దొరకవు అన్న టాక్ ఉండేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. దీనికి కారణం ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తూ హవాను చూపిస్తుండడమే. అలాంటి వారిలో హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్ ఒకరు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. హీరోయిన్‌గా మారి తన మార్కును చూపించుకుంది. ఫలితంగా వరుసగా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తన అందాలతో హీటు పెంచేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నందినీ కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి!

అందంతో మాయ చేసేసింది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులోకి ఎంటరైన తక్కువ సమయంలోనే తన అందచందాలతో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. అప్పుడే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది.

హీరోయిన్‌గా.. అక్కడ ఫేమస్ పేరుకు హైదరాబాద్ అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే ఫస్ట్ ఆఫర్ అందుకుంది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగెట్టింది. ఈ క్రమంలోనే ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’ వంటి చిత్రాలు చేసింది.

బిగ్ బాస్ షోతో సుపరిచితం తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. కానీ, బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. షోలో ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మాయి.. కొందరితో క్లోజ్‌గా ఉంటూ హాట్ టాపిక్ అయింది. టాస్కుల్లో చక్కగా ఆడినా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, ఈ షో వల్ల మరింత క్రేజ్ తెచ్చుకుంది.

వాటిలోనూ చేస్తూనే ఉందిగా నందినీ రాయ్‌కు బిగ్ బాస్ తర్వాత తెలుగులో ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఆమెకు అవకాశాలు పెద్దగా దక్కట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలనైనా చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించి అందరికీ షాకిచ్చేసింది.

సోషల్ మీడియాలో సందడి వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదులుతూ హల్‌చల్ చేస్తోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ కొంత కాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా నందినీ రాయ్ సోషల్ మీడియాలో చేసే హడావిడికి నిత్యం వార్తల్లోనే ఉంటోంది. దీనికి కారణం ఈ అమ్మడు తరచూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతుండడమే. మరీ ముఖ్యంగా తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో నందినీ రాయ్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ తరచూ హైలైట్ అవుతోంది.

స్విమ్ సూట్‌లో యమ హాట్‌గా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉండే నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్‌తో కనిపించింది. ఫలితంగా తడిచిన డ్రెస్‌లో ఆమె అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.

About the Author

Leave a Reply

*