హీరోయిన్‌తో నాగ చైత‌న్య డేటింగ్‌..కోడై కూస్తున్న బాలీవుడ్ మీడియా.. నిజానిజాలేంటి!

Shobita Dhulipala : నాగ చైత‌న్య‌.. స‌మంత (Samantha Ruth Prabhu) వ్య‌క్తిగ‌త జీవితాల‌పై సోషల్ మీడియాలో ఏదో రకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. డేటింగ్ చేసుకుంటున్నార‌ని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టాయి. కాగా.. ఇప్పుడు బాలీవుడ్ మీడియా నాగ చైత‌న్య ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడంటోంది. స‌ద‌రు హీరోయిన్ బ‌ర్త్ డే కోసం ముంబైలోని ఓ స్టార్ హోట‌ల్‌కి వ‌చ్చాడ‌ని అక్క‌డి మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. ఇంత‌కీ నాగ చైత‌న్య డేటింగ్ చేస్తున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా!

అక్కినేని హీరో నాగ చైత‌న్య (Akkineni Naga Chaitanya) గ‌త ఏడాది హీరోయిన్ స‌మంత (Samantha) నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎంతో చ‌క్క‌గా ఉన్న వీరిద్ద‌రూ అభిమానుల‌కు, ఫ్యాన్స్‌కు షాకిస్తూ త‌మ విడాకుల విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. గ‌త ఏడాది సినీ జ‌నాలు హాట్ టాపిక్‌గా అంద‌రూ డిస్క‌స్ చేసుకున్న అంశాల్లో ఇది కూడా ఒక‌టి అంటే కాద‌న‌కుండా ఉండ‌లేం. త‌ర్వాత ఇటు నాగ చైత‌న్య‌, అటు స‌మంత‌.. ఇద్ద‌రూ ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా మారిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌తోనే ఎక్కువ‌గా మ‌మేక‌మ‌య్యారు.

అదే స‌మ‌యంలో నాగ చైత‌న్య‌.. స‌మంత (Samantha Ruth Prabhu) వ్య‌క్తిగ‌త జీవితాల‌పై వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. డేటింగ్ చేసుకుంటున్నార‌ని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టాయి. కానీ వీటికి ఇద్ద‌రూ ఎలాంటి రియాక్ష‌న్ ఇవ్వ‌లేదు. కాగా.. ఇప్పుడు బాలీవుడ్ మీడియా నాగ చైత‌న్య ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడంటోంది. స‌ద‌రు హీరోయిన్ బ‌ర్త్ డే కోసం ముంబైలోని ఓ స్టార్ హోట‌ల్‌కి వ‌చ్చాడ‌ని అక్క‌డి మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. వారి వివ‌రాల మేర‌కు ఇంత‌కీ నాగ చైత‌న్య డేటింగ్ చేస్తున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా! శోభితా ధూళిపాల‌ (Shobita Dhulipala). గూఢ‌చారి, మేజ‌ర్ (Major) చిత్రాల్లో నటించి మెప్పించిన శోభిత‌.. ఇప్పుడు నాగ చైత‌న్య‌తో ప్రేమ‌లో ఉంద‌ని టాక్‌.

నాగ చైత‌న్య (Naga Chaitanya) హైద‌రాబాద్‌లో త‌న డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన ప‌నులు చ‌క చ‌కా జ‌రుగుతున్నాయి. నాగ చైత‌న్యకి వీలున్న‌ప్పుడ‌ల్లా ఆ ప‌నులను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ట‌. రీసెంట్‌గా శోభిత కూడా ఆ ఇంటి ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని వార్త‌లైతే గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. మ‌రి వీరిద్ద‌రూ వారి వ్య‌క్తిగ‌త జీవితాల‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తారో లేదో చూడాలి మ‌రి.

ఇక నాగ చైత‌న్య విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న హీరోగా న‌టించిన థాంక్యూ (Thank You) సినిమా రిలీజ్‌కి సిద్దంగా ఉంది. ఈ సినిమాను విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించారు. మ‌రో వైపు దూత అనే వెబ్ సిరీస్‌తోనూ మెప్పించ‌డానికి సిద్ధ‌మవుతున్నారీ అక్కినేని క‌థానాయ‌కుడు.

About the Author

Leave a Reply

*