Fourth wave Scare: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు… కొత్త కేసులు ఎన్నంటే?

Covid 19 fourth wave in india: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 5,233 మందికి (Corona Cases in India) వైరస్ సోకింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 శాతం కేసులు పెరిగాయి. కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి  3,345 మంది కోలుకున్నారు. దీంతో మెుత్తం రికవరీ అయినవారి సంఖ్య 98.72 శాతానికి చేరింది.  మృతుల సంఖ్య 1.22 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్తంగా మెుత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,90,282‬‬ కు చేరగా.. టోటల్ మరణాల సంఖ్య 5,24,715గా నమోదైంది. ఇప్పటి వరుకు కోలుకున్నవారి సంఖ్య 4,26,36,710గా ఉంది. భారత్ లో 28, 857 యాక్టివ్ కేసుల ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరో 3,13,361 మందికి కరోనా పరీక్షలు చేశారు.  ముంబైలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేశారు.

భారత్​లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం 14,94,086 మందికి కరోనా టీకాలు (Covid-19 Vaccination in india) వేశారు. దీంతో ఇప్పటి వరుకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,94,43,26,416కు చేరింది. వరల్డ్ వైడ్ గా నిన్న ఒక్క రోజే 5,42,669 కేసులు వెలుగుచూశాయి. మరో 1510 మరణాలు చోటుచేసుకున్నాయి. తైవాన్​లో అత్యధికంగా 83,027 కేసులు, 124 మరణాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో 81,332 తాజా కేసులు, 339 మరణాలు చోటుచేసుకున్నాయి.

About the Author

Leave a Reply

*