2022 జులై 12 న విడుదల కానున్న ‘ఆడి’ కార్ ఇదే.. బుకింగ్స్ కూడా మొదలైపోయాయ్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ (Audi) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి. కంపెనీ దేశీయ మార్కెట్లో నిరంతరం తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఆడి కంపెనీ మార్కెట్లో తన ‘ఏ8 ఎల్’ (A8 L) సెడాన్ యొక్క కొత్త వేరియంట్ ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

‘ఆడి ఇండియా’ ఇండియన్ మార్కెట్లో తన ‘ఆడి ఏ8 ఎల్’ (Audi A8 L) యొక్క కొత్త వేరియంట్ ను 2022 జులై 12 న అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సెడాన్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున ఈ సెడాన్ కొనాలనుకునే కస్టమర్లు రూ. 10 లక్షలు చెల్లించి కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త సెడాన్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా.. ఇది మునుపటి ఏ8 మోడల్‌ కంటే కూడా పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ లో కంపెనీ డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ లైట్ సెటప్‌ వినియోగించింది. అది మాత్రమే కాకుండా ఇందులో కొత్త క్రోమ్-ఫినిష్డ్ రేడియేటర్ గ్రిల్‌ ఇందులో ఉంటుంది. వెనుక వైపున సెడాన్ వెడల్పు అంతటా లైట్ బార్ చుట్టి, సొగసైన ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ ఉంటుంది. మొత్తం మీద ఇది చాలా అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

‘ఆడి ఏ8 ఎల్’ సెడాన్ యొక్క క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇది 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు అప్డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఫోల్డబుల్ సెంటర్-కన్సోల్ టేబుల్ మరియు మినీ-బార్‌, రిక్లైనర్, ఫుట్ మసాజర్ వంటి వాటితో పాటు దాని మునుపటి మోడల్ లోని దాదాపు అన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 48వి మైల్డ్-హైబ్రిడ్ 3-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఆడి ఏ8 ఎల్ సెడాన్ యొక్క అధికారిక ధర ఇంకా వెల్లడి కాలేదు, కానీ దీని ధర దాదాపు రూ. 1.40 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సెడాన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (Mercedes-Benz S-కClass) మరియు బీఎండబ్ల్యూ 7 (BMW 7) సిరీస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇదిలా ఉండగా జర్మన్ కార్ కంపెనీ త్వరలో భారతీయ మార్కెట్లో కూడా స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయనుంది. అయితే భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారికి అనుకూలంగా ఉంటుందా లేదా అని కూడా యోచిస్తోంది. కంపెనీ ఇప్పటికే వ్యాప్తంగా తమ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి కృషి చేస్తోంది.

ఇదిలా ఉండగా ఆడి కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2023 నుంచి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ప్రధాన కారణం లేకుండా పోలేదు.

రోజు రోజుకి పెరుగుతున్న చమురు (పెట్రోల్ & డీజిల్) ధరల కారణంగా ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి సుముఖత చూపుతున్నారు. కావున రానున్న రోజుల్లో దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. కావున రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే రాజ్యమేలే అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

About the Author

Leave a Reply

*