27న బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం..
చంద్రుడిపై పడే కిరణాలు భిన్న రంగుల్లో :
జూలై 27న రాత్రి 11:45 నిమిషాలకు గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెల్లవారుజామున 2:43 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 3:49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడవచ్చని తెలిపింది,

చంద్రుడిపై పడే కిరణాలు భిన్న రంగుల్లో
ఈ నెల 27న ఈ శతాబ్ధంలోనే అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. 2000 సంవత్సరం జులై 16న ఒక గంటా 46 నిమిషాలు, 2011 జూన్ 15న 1:40 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 27వ తేదీ అర్థరాత్రి సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతం కానుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం 1:43 నిమిషాల పాటు కొనసాగనుంది.
ఖగోళ పరంగా సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్య మీదకు వచ్చినప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నా చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు.