74 శాతం ఏటీఎంలలో కాలం చెల్లిన సాఫ్ట్ వేర్ !

ఏటీఎంలు సపోర్ట్ చేయని సాఫ్ట్‌వేర్‌ :

పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని చాలా వరకు ఏటీఎంలు సపోర్ట్ చేయని సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నాయని, దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉందని ఓ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి సమాధానంగా ప్రభుత్వం పై వివరాలు వెల్లడించింది,

 

ఏటీఎంలు సపోర్ట్ చేయని సాఫ్ట్‌వేర్‌

ఏటీఎంలు సపోర్ట్ చేయని సాఫ్ట్‌వేర్‌

 

దేశ వ్యాప్తంగా వున్న ఏటీఎంలలో 74 శాతం ఏటీఎంలు కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నట్టు తేలింది. దీంతో 25 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు మోసాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా వుందని ప్రభుత్వం తెలిపింది.

దేశంలోని మొత్తం ఏటీఎంలలో 89 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే. గత కొన్ని నెలలుగా ఏటీఎం మోసాలు పెరిగాయి. జూలై 2017 నుంచి 2018 మధ్య డెబిట్, క్రెడిట్‌లకు సంబంధించి 25వేల ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపింది. హ్యాకర్లు అత్యాధునిక పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని, వారి బారిన పడకుండా బ్యాంకులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-reena-barot-latest-hot-pics/

About the Author

Leave a Reply

*