సూటిగా సుత్తిలేకుండా ముగ్గురు మొనగాళ్లు :

‘మాయ’ చేయటానికి సిద్దమవుతున్న ముగ్గురు ‘మొనగాళ్లు’ :

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ‘ఉప్పెన’ మొదలుకొని ‘జాతిరత్నాలు’ వరకు బాక్స్ ఆఫీసును షేక్ చేశాయి. వీటి తరహాలోనే మరొక సినిమా విడుదలకు సిద్ధమైంది…అచ్యుత రామారావు నిర్మించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి | దీక్షిత్ శెట్టి | వెన్నెల రామారావు… ప్రధానమైన పాత్రలను పోషించారు.వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల జీవితంలో జరిగిన ఆసక్తికర ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ టీజర్ చిత్రబృందం విడుదల చేసింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. రాజారవీంద్ర | త్విష్‌ శర్మ |శ్వేతా వర్మ | జెమినీ సురేష్‌ | భద్రం ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం…. బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

About the Author

Leave a Reply

*