బొచ్చు ఖరీదు రూ. 60 లక్షలు… నిర్వాహకుల నిరాశ !
‘బొచ్చు’ మార్కెట్లో ‘వేలం’.. ఖరీదు ‘రూ.60 లక్షలు’:
తల వెంట్రుకలు కూడా వేలంలో లక్షలు పలుకుతాయనేది కలియుగంలో ఒక వింత… అసలు విషయానికి వస్తే…అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ను వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్ థియేటర్ వద్ద 1865లో జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి కాల్చి చంపాడు.
తదనంతరం జరిగిన పోస్టుమార్టం పరీక్షలో సుమారు 2 అంగుళాల పొడవాటి జుట్టును తొలగించారు. శవపరీక్ష జరిపిన సమయంలో కొంత జుట్టును భద్రపరిచారు. లింకన్ భార్య వాటిని తన బంధువులకు ఇచ్చింది.
అవి చేతులు మారి వేలానికి వచ్చాయి. వెంట్రుకలతోపాటు వాటికి సంబంధించిన టెలిగ్రామ్‌ను కూడా కలపి అమ్మేశారు.
ఈ వెంట్రుకలు చివరిసారిగా 1999 లో విక్రయించినట్లు వేలం హౌస్ తెలిపింది. బోస్టన్ కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్స్ సంస్థ శనివారం మరోసారి నిర్వహించిన వేలంలో ఒకరు 81,250 డాలర్లకు… అంటే మన ‘ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.59,63,477.81’. సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను సదరు సంస్థ వెల్లడించలేదు.
అయితే, నిర్వాహకులు… ఊహించిన దానికంటే తక్కువ ధరే పలకటం… తమను దిక్బ్రాంతికి గురి చేసిందని సెలవిచ్చారు.