మరో మారు బాంబులతో వణికిన కొలంబో !

మరో మారు బాంబులతో వణికిన కొలంబో:

ఈస్టర్ డే రోజున జరిగిన మారణహోమంతో అప్రమత్తమైన శ్రీలంక పోలీస్ శాఖ దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తోంది । దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది.

ఇప్పటికే విమానాశ్రయం వద్ద ఉగ్రవాదులు అమర్చిన బాంబులను పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు.

 

మరో మారు బాంబులతో వణికిన కొలంబో

మరో మారు బాంబులతో వణికిన కొలంబో

 

ఇప్పుడు శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రధాన బస్టాండ్‌లో 87 డిటోనేటర్లను గుర్తించారు, దీనితో మరింత అప్రమత్తమైన అధికారులు పెద్ద పెద్ద హోటళ్లు । బస్టాండ్లు । విమానాశ్రయాలు ఇతర రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.

ఈ వరుస బాంబు దాడుల మరణహోమాన్ని మర్చిపోక ముందే రాజధాని కొలంబోలోని కోటహెన ప్రాంతంలోని  చర్చి వద్ద  తాజాగా మరో పేలుడు సంభవించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం,  చర్చి వద్ద ఆగి ఉన్న వ్యానులో బాంబు ఉందని తెలిసి దాన్ని పోలీసులు నిర్వీర్యం చేసేలోపు అది ఒక్కసారిగా పేలింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*