నోరుజారిన ‘లోకేష్’ కవర్ చేసుకోలేక ‘పాట్లు’ !
నోరుజారిన ‘లోకేష్’ కవర్ చేసుకోలేక ‘పాట్లు’:
2019 ఎన్నికలు ఏపీ లో మూడు పార్టీల తలరాతలను డిసైడ్ చేయనున్నాయి, ఈ నేపథ్యంలో ప్రచారం పోటా పోటీ గా సాగుతుంది. పనిలో పనిగా ఒకరి పై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు, తాయిలాలతో ప్రజలను ఊదరకొడుతున్నారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు అయితే గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ప్రచారం చేస్తూ నోరు జారారు.

నోరుజారిన ‘లోకేష్’ కవర్ చేసుకోలేక ‘పాట్లు’
నారా లోకేశ్ మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తప్పకుండా టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అయితే లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు.
టీడీపీ కార్యకర్త ఒకరు లోకేశ్ అన్నా ఎన్నికలు తొమ్మిది కాదు, పదకొండు అని అనడంతో లోకేశ్ కవర్ చేసుకోలేక తర్జనభర్జన పడ్డారు. అయితే లోకేశ్ చేసిన ఈ తప్పుడు ప్రకటన పట్ల వైసీపీ, జనసేన నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో లోకేష్ వీడియోని పోస్ట్ చేసి సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో కామెంట్‌లు చేసారు. లోకేశ్ చెప్పినట్లుగా ప్రజలంతా ఏప్రిల్ 9న టీడీపీకి ఓటు వేయాలన్నారు. అయితే ఏప్రిల్ 11న మాత్రం వైసీపీ కి ఓటేసి గెలిపించాలని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.
Read Also: https://www.legandarywood.com