Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. వయో పరిమితి పెంపు.. పూర్తి వివరాలివే

Agneepath Protests Secunderabad: అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Agneepath Scheme: తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ (Agnipath Army Recruitment Scheme) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ Agnipath స్కీమ్‌ను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో Agnipath స్కీమ్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

గరిష్ట వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచారు. అంటే 23 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 2022 నియామకాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 ఏళ్లుగా కేంద్రం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే.. కరోనా(Coronavirus) కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియామకాలుచేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియమకాలకు సంబంధించి అర్హతను గరిష్టంగా 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది.

Agnipath recruitment scheme: త్రివిధ దళాల్లో మమేకమై దేశానికి సేవచేయాలని భావిస్తున్న యువతకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సరికొత్త విధానాన్ని ప్రకటించారు. ఆర్మీ (Indian Army)లో చేరి కొద్దిరోజులైనా సేవలు అందించాలని కలలు కనే యువతకు ఇది నిజంగా గుడ్ న్యూస్. అలాంటి వారి కోసమే ఈ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ప్రకటించారు.

About the Author

Leave a Reply

*