అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు @ వైద్యులు !
అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు @ వైద్యులు:
‘ఎయిర్ మార్షల్’ అభినందన్ వర్ధమాన్‌కు ఆదివారం నాడు ఢిల్లీలోని రీసెర్చి, రెఫరెల్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు తెలిపారు. మూకల దాడిలో అభినందన్ పక్కటెముకలు కొద్దిగా దెబ్బతిన్నాయని తెలిపారు. అభినందన్ వెన్నెముకకు కూడా కొద్దిగా గాయమైందని తెలిపారు.
మిగ్-21 యుద్ధ విమానం నుంచి ఆయన కింద పడిన సమయంలో ఈ గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, పాకిస్థానీయులు చేసిన దాడి కారణంగా కూడా అభినందన్‌కు గాయాలైనట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. భారత యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కిందపడగానే ఆయనపై వారు దాడి చేసినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు తెలుస్తోంది.
దిగ్విజయ్‌సింగ్ డిమాండ్:
ఇదిలా ఉండగా, బాలాకోట్ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడికి సంబంధించి ఆధారాలు, ఫొటోలు బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ ఆపరేషన్‌పై తనకేమి అనుమానాలు లేవన్నారు. ప్రస్తుతం పరిజ్ఞానం ప్రకారం శాటిలైట్ ఫొటోలు బయటపెట్టడం అంతకష్టమేని కాదన్నారు.
వాయుసేన అధికారి అభినందన్‌ను విడిచిపెట్టడంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు దిగ్విజయ్‌సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. 2011లో ముంబై దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని భారత వాయుసేన కోరగా.. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పుకోలేదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
Read Also: https://www.legandarywood.com