గోమూత్రం అమృతం ప్రతిరోజూ తాగుతాను !
గో’మూత్రం’ అమృతం… ప్రతిరోజూ ‘తాగుతాను’:
సనాతన ధర్మాన్ని పాటించే వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్… అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. ఆయన ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో లో భాగంగా… భారతీయ సంస్కృతిలో గోవు పంచకం యొక్క ప్రాధాన్యతను చెప్పారు.
ఇప్పటికి చాలా గ్రామాల్లో సర్వరోగాల నివారణకు’చిన్నపిల్లల’కి గోవు మూత్రం తాగిస్తారని..అలాగే స్నానం కూడా చేయిస్తారు.
తాను కూడా ‘అల్పాహారం’లో గోవు ‘మూత్రం’ తాగుతానని ‘సంచలన’ విషయాన్ని వెల్లడించారు.
అక్షయ్ తో తన అనుభవం గురించి బేర్ మాట్లాడుతూ.. అయన ఎంతో ప్రశాంతంగా ఉంటారని, ఎలాంటి అహం లేదని, వినయంగా ఉండే వ్యక్తి అని అక్షయ్ కుమార్ ను బేర్ గ్రిల్స్ ఆకాశానికెత్తాడు. ఈ ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో ‘సెప్టెంబర్ 11 ‘ రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ చానల్‌లో.. ‘సెప్టెంబర్ 14 ‘ న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్‌లో టెలికాస్ట్ అవుతుంది.