‘అంబాని’ చూపు… ‘దివాలా’ వైపు !
‘అంబాని’ చూపు… ‘దివాలా’ వైపు:
అనిల్ అంబాని కి చెందిన ఆర్‌కామ్ దాని అనుబంధ సంస్థలైన రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ । రిలయన్స్ టెలికంలపై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటీషన్ ను ఉప-సంహరించుకోవటంతో, నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రి బ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) దివాలా ప్రక్రియకు అనుమతించింది.
బ్యాంకులకు ఆర్‌కామ్ రూ. 45, 733 కోట్లు । దాదాపు రూ 1,500 కోట్ల బకాయిల వసూళ్లలో భాగంగా 2017 సెప్టెంబర్‌లో ఎరిక్సన్ ఇం డియా, అడాగ్ గ్రూప్ పై దివాలా పిటీషన్ వేసింది.

‘అంబాని’ చూపు… ‘దివాలా’ వైపు
అదే నెలలో, ఆర్‌కామ్ ఒక పిటిషన్ దాఖలు చేయగా మే30న ఉత్తర్వులను నిలిపివేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలిచ్చింది. తాజాగా, అప్పులను తగ్గించుకునే విషయమై దివాలా పిటీషన్ ను ఎదుర్కోవాలని అనిల్ అంబాని యాజమాన్యంలోని బోర్డు నిర్ణయించటంతో దివాలా పిటీషన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది.
అనిల్ అంబాని నిర్ణయంతో, అడాగ్ షేర్స్ మంగళవారం భారీ కుదుపుకు లోనయ్యాయి.
- ఆర్ పవర్ కంపెనీ షేరు 18.13 %
- ఆర్ హోమ్ ఫైనాన్స్ షేరు 10.60 %
- రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేరు 9.92 %
- ఆర్ క్యాపిటల్ కంపెనీ షేరు 8.47 %
- రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ షేరు 6.89 % చొప్పున నష్టపోయాయి.
Read Also: https://www.legandarywood.com