Ancient India’s Ayurveda is the best choice @now a days !

మెడికల్ మాఫియాతో ఆయుర్వేదం పోరాటం:

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు ఆనందయ్య ఈయన ఆయుర్వేద వైద్యుడు, అధికారులు | వైద్యులు | కార్పొరేట్ | మెడికల్ మాఫియా ఇత్యాది వారితో విసిగిపోయి.. అంటే ఏదైనా రోగం వస్తే, అది చిన్నదైనా పెద్దదైన లక్షలకు లక్షలు వారికీ సమర్పించినా తగ్గుతుందని నమ్మకం లేదు… ఎవరైనా మరణించినా అడిగే హక్కు లేదు…భారతీయ సనాతన ధర్మంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఇప్పటికి కొందరు అదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు, అందులో ఒకరు ఆనందయ్య… అయన చికిత్సచే ఎంతోమంది కోలుకుంటున్నా, మెడికల్ మాఫియా ఇత్యాది వారు కొందరు నైతిక విలువలు కోల్పోయిన మీడియా వారిచే… దుష్ప్రచారం చేయిస్తున్నారు.

ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు గారి మాటల్లో ఆనందయ్య పంపిణీ చేసే మందులో హానికారక పదార్థాలు లేవని, అయితే, దానిని ఆయుర్వేద మందుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ఇక్కడి పరిస్థితులపై ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ కు నివేదిక పంపిస్తామన్నారు. కాగా, ఆనందయ్య ఇచ్చే మందులో పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప చిగురు, మారేడు చిగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటి ముడి పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తున్నారు.

అయితే ఈయనకు అండగా టీటీడీ | చిలుకూరు బాలాజీ అర్చకులు ఉన్నారు. ఆనందయ్య ఔషధం తయారీ విధానం… వినియోగించిన వన మూలికలు.. మందు ఏ విధంగా పనిచేస్తుంది… అనే అంశాలపై ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి బృందం ఆరా తీసింది. నమూనాలను సేకరించిన అనంతరం ఆనందయ్య కుటుంబ సభ్యులతో చర్చించింది. మందు పనితీరు గురించి గ్రామ ప్రజలనూ అడిగి తెలుసుకుంది. ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాను ఆయుర్వేద మందు నయం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్న వేళ….ఔషధం పనితీరుపై యుద్ద ప్రాతిపదికన అధ్యయనం సాగించాల్సిన అవసరం ఉందని చెవిరెడ్డి అన్నారు. ఆయుర్వేద మందు నిజంగా ఆమోదయోగ్యమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించేందుకు టీటీడీ ఆయుర్వేదిక్ ఫార్మసీ ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు.

చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఆయనకు అండగా నిలిచారు. వివాదాల మాటెలా ఉన్నప్పటికీ దీన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సీఎస్ రంగరాజన్ వృత్తిరీత్యా చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడే అయినప్పటికీ ఆయన ఉన్నత విద్యావంతుడు, బయోమెడికల్ ఇంజినీర్. బయోమెడికల్ సైన్స్‌పై రంగరాజన్‌కు పూర్తి పట్టు ఉంది. నేచురల్ సైన్స్, ఫార్మల్ సైన్స్‌గా భావించే బయోమెడికల్ ద్వారా కరోనా వైరస్‌ పేషెంట్లకు చికిత్స చేయవచ్చని చెప్పారు.

అయితే ఈ ఆయుర్వేదం మెడికల్ మాఫియాతో తట్టుకొని ఎంతకాలం నిలబడుతుంది అనేది మిల్లియన్ డాలర్ల ప్రశ్న అనేది కొసమెరుపు?

About the Author

Leave a Reply

*