‘సీత’ గా అభినయించనున్న ‘అనుష్క’ !
‘సీత’ పాత్రలో తళుక్కున మెరవనున్న ‘అనుష్క’:
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ మూవీ ‘భారీబడ్జెట్’తో తెరకెక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో సైఫ్అలీఖాన్ విలన్ రోల్ ‘లంకేశ్’లో నటిస్తున్నారు.
‘రాము’ని పాత్రలో ‘ప్రభాస్’ కు జోడిగా సీతాదేవి పాత్ర కోసం వేటలో ఉన్నారు. సీత పాత్ర కోసం ఇప్పటికే కీర్తిసురేశ్ | కైరా అద్వానీ | ఊర్వశి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
తాజా వార్త బీటౌన్ లో చెక్కర్లు కొడుతోంది. దర్శకుడు ఓం రావత్ బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను సంప్రదించి కథను వినిపించారు. ఆయన చెప్పిన కథనానికి… విజన్ కు…. ‘అనుష్క’ ఫిదా అయ్యి ‘పాజిటివ్’ గా స్పందించింది.
అయితే విరుష్క జంట మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆమె డెలివరీ తరువాత… 2 నెలల్లో… షూటింగ్ లో జాయిన్ కానుందట. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ఆదిపురుష్’ షూటింగ్ ‘జవవరి’ నుంచి మొదలు కానుండగా… తొలి షెడ్యూల్ లో ‘ప్రభాస్ | సైఫ్’ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు సమాచారం.