‘లేడీ సూపర్ స్టార్’ పై కన్నేసిన ‘అర్జున్ రెడ్డి’ !

‘లేడీ సూపర్ స్టార్’ పై కన్నేసిన ‘అర్జున్ రెడ్డి’:

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ‘సంచలనం’గా మారిన ‘విజయ్ దేవరకొండ’, తదుపరి గీత గోవిందం సినిమాతో ఫుల్ జోషులో ఉన్నాడు.

చివరిగా ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించలేక పోయాడు, కాగా ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

'లేడీ సూపర్ స్టార్' పై కన్నేసిన 'అర్జునరెడ్డి'

‘లేడీ సూపర్ స్టార్’ పై కన్నేసిన ‘అర్జునరెడ్డి’

 

ఈ రెండు చిత్రాలు 2019లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే నోటా సినిమాతో తమిళ ప్రేక్షకులని పలకరించిన విజయ్ ఇప్పుడు కోలీవుడ్‌లో మరో సినిమా చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ  హీరోగా ‘విజయ్ దేవరకొండ’ జోడిగా హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ అనే టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావలసి ఉంది.

ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే అతి తక్కువ సమయంలో నయనతారతో జతకట్టే ఛాన్స్ విజయ్ దేవరకొండకి రావడం గొప్పే మరి.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*