Ayurvedic experts strong warning about the Regular eating plan !

ప్రతిరోజూ తినే ఆహారం గురించి…ఆయుర్వేద నిపుణుల సలహా:
భోజనం తరువాత కంటే భోజనం చేసే ముందే స్వీట్స్ తింటే మంచిదని ఎంత మందికి తెలుసు? దీని గురించి ఆయుర్వేద నిపుణుడు ‘డాక్టర్ నితికా కోహ్లీ’ మాటల్లో…తీపి పిదార్థాలు తినే సమయం.. ఓజస్(మెరుగైన జీర్ణ వ్యవస్థ) | ఆమ్లత్వాన్ని(అసడిటీ, విషతత్వం) రెండింటినీ ప్రభావితం చేస్తుంది. పెంచుతుంది. అందుకే తినే ఆహారంపై అవగాహన ముఖ్యం అని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు.
1.) భోజనం ప్రారంభంలో స్వీట్లు తింటే జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
2.) భోజనం తర్వాత స్వీట్లు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మందగిస్తుంది.
3.) తీపి పదార్థాన్ని భోజనం ముందుగా తినడం వల్ల జీర్ణ స్రావాల ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది.

4.) తీపి పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
5.) భోజనం చివరిలో స్వీట్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. అసిడిటీ సమస్య తలెత్తుతుంది. అజీర్తి సమస్యలు వస్తాయి.
6.) భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే గ్యాస్ ఏర్పడుతుంది | కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

ఆయుర్వేద నిపుణులు అందించిన ఈ టిప్స్…సర్వులు పాటించి…సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ…మీ లెజండరీవుడ్.

About the Author

Leave a Reply

*