ఉపాధి హామీ పధకంలో బాలీవుడ్ భామలు !

ఇంటి దొంగల చేతివాటం బాలీవుడ్ భామల పాట్లు:

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా…’మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లక్ష్యాలను పెంచేందుకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ నరేగా పథకంలో మధ్యప్రదేశ్‌లోని ‘పిపార్కెడా నాకా’ పంచాయతీ సర్పంచ్ | కార్యదర్శి | జిల్లా సహాయకుడు…లబ్ధిదారుల నకిలీ జాబ్ కార్డులను రూపొందించగా…. వారి ఫోటోల స్థానాలలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే | జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫోటోలు పొందుపరిచి ఫేక్ జాబ్ కార్డ్స్ రూపొందించారు.

మోను దుబే పేరుతో ఉన్న జాబ్ కార్డులలో… బాలీవుడ్ భామ దీపికా పదుకొనే చిత్రాన్ని| సోను అనే లబ్ది దారుని జాబ్ కార్డ్‌పై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫోటోని ముద్రించి మోసాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి బాధితులు మాట్లాడుతూ మేము పనికి వెళ్లకపోయినా మా పేరు మీద ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఉపసంహరించుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా పంచాయత్ సీఈఓ గౌరవ్ బెనాల్ విచారణకు ఆదేశించారు. ఫోటో కార్డ్‌లపై సెలబ్రిటీల ఫోటోలు ఎలా ప్రింట్ అయ్యాయి | అకౌంట్‌లోని నగదు ఎలా ఉపసంహరణ జరిగిందనే విషయంపై పూర్తి నివేదిక తయారు చేయమని సదరు అధికారులను ఆదేశించారు.

అయితే ఎన్ని గవర్నమెంట్ లు మారిన సర్కార్ ఉద్యోగులు తమ చేతి వాటం వదలక పోవటం ఇక్కడ కొస మెరుపు.

About the Author

Leave a Reply

*