Cannibalism Custom in Tamilanadu !

పక్క రాష్ట్రంలో… నరమాంస భక్షణ వారి ఆచారం:

చనిపోయిన మనిషి దగ్గరకు వెళ్లటానికే జంకుతారు, అలాంటిది చనిపోయిన శవాన్ని ఊరేగించి | మాంస భక్షణ చేసిన ఘటన | దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటన మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ‘తెన్‌కాశి’లో జరిగింది.

‘తమిళనాడు’లోని ‘టెంకాసీ’ జిల్లా పరిధిలో ‘కల్లురానీ’ అనే గ్రామంలో ‘సమియాదీ’లు అనే ఒక తెగ ఉంది. ఈ తెగకు చెందిన వారు ప్రతీ ఏటా తమ ఊరిలోని శక్తిపోతి సుడలై మదసామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ ఆడిపాడతారు. అయితే… కొందరు మనిషి పుర్రెను తీసుకొచ్చి అందరి ముందూ నృత్యం చేయడం.. నర మాంసాన్ని కూడా పీక్కు తినడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, ఆ సమయంలో మాంత్రికులు మత్తులో ఉన్నారని, ఆ గ్రామ దేవత వారిని ఆవహించిందని పేర్కొంటున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, సగం కాలిన మృతదేహాన్ని ఏదైనా గ్రామంలోని శ్మశానవాటిక నుంచి తీసుకొచ్చారా? అనే విషయం అంతుపట్టకుండా ఉంది. రెండేళ్ల క్రితం కూడా ఈ ‘సమియాదీ’లు ఇదే పండగ సందర్భంగా …ఇదే తరహాలో ప్రదర్శించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.

అయితే పోలీసులు దీనిగురుంచి ప్రశ్నించగా.. ఇది తర తరాలుగా వస్తున్న ఆచారమని సమాధానం రావటంతో…అవాక్కవటం పోలీసుల వంతయింది.

About the Author

Leave a Reply

*