మరోమారు లాక్ డౌన్ షురూ.. కేంద్రం యోచన !

సెప్టెంబర్ 25 నుంచి మరోమారు లాక్ డౌన్ షురూ.. కేంద్రం తర్జన భర్జన:

కరోనా వైరస్ రోజు రోజుకు తన కోరలు చాచి దేశాన్ని కబళిస్తుండటంతో… సెప్టెంబర్ 25 నుంచి దేశమంతటా లాక్ డౌన్ విధించేందుకు కేంద్రం సిద్ధం అయిందంటూ సోషల్ మీడియాలో ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ)’ పేరుతో….

“కరోనా వైరస్ మరణాల రేటు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా 46 రోజులపాటు కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్‌తో కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రభుత్వాన్ని కోరింది.

అయితే, అత్యవసర వస్తువులను మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇందుకు అనుగుణంగా సిద్ధమవుతారన్న సారాంశంతో ఎన్‌ఎండీఏ ముందస్తు నోటీసు జారీ చేసింది” అని ఈ నెల 10 తేదీన జారీ అయినట్టుగా ఉన్న సర్క్యులర్‌ పేర్కొంది.

కేంద్రం వివరణ ఇస్తూ…ఈ వార్త పూర్తిగా ఫేక్ అని…ఎన్ఎండీఏ ఎలాంటి సర్క్యులర్లూ జారీ చేయలేదని….ఇంకా ఈ సమాచారాన్ని తప్పుడు వార్తగా నిర్దారింఛి ‘ఫేక్ న్యూస్’ అలెర్టులో పోస్ట్ చేసింది.

అయితే ఈ సమాచారం ప్రకారం లాక్ డౌన్ ఉంటుందా… ఉండదా…అని తెలియాలంటే 25th వరకు ఆగాల్సిందే.

About the Author

Related Posts

Leave a Reply

*