చిరు తర్వాత రాజశేఖరే….

చిరు తర్వాత రాజశేఖరే :

 

సినిమాలకు అసలు మార్కెట్టే లేదు

సినిమాలకు అసలు మార్కెట్టే లేదు

 

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మానేసే సమయానికి ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు అసలు మార్కెట్టే లేదు. దీంతో గత ఏడాది చివరి వరకు చిరుకు అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్ల సినిమా లేదు. మిలియన్ డాలర్ల సినిమానూ లేదు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు చిరు. ఈ సినిమా ఏకంగా చిరును తీసుకెళ్లి 2 మిలియన్ క్లబ్బులో కూర్చోబెట్టేసింది. ఇది మామూలు ఫీట్ కాదనే చెప్పాలి. ఇప్పుడు రాజశేఖర్ కూడా యుఎస్ తెలుగు సినిమాల మార్కెట్లోకి తన స్థాయిలో గ్రాండ్ గానే ఎంట్రీ ఇచ్చాడు.

చిరులా సినిమాలకు పూర్తిగా దూరం కాకపోయినప్పటికీ.. రాజశేఖర్ సినిమాలు ఇంతకుముందు ఏవీ అమెరికాలో రిలీజే కాలేదు. ‘గరుడవేగ’ సినిమానే అమెరికాలో రిలీజైన తొలి రాజశేఖర్ సినిమా. ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధిస్తోందక్కడ. పెద్దగా అంచానల్లేకుండా రిలీజైన ఈ థ్రిల్లర్.. ఎన్నారై తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కేవలం రూ.32 లక్షలకు ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకున్నాడు యుఎస్ బయ్యర్. ఈ చిత్రం అక్కడ ఫస్ట్ వీకెండ్లోనే 2.5 లక్షల డాలర్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది.

ఇప్పటిదాకా ఆ చిత్రం 4.5 లక్షల డాలర్లు వసూలు చేసింది. రెండో వీకెండ్ లో కూడా ‘గరుడవేగ’ చెప్పుకోదగ్గ వసూళ్లే సాధించింది. ఈ వారాంతంలో వచ్చిన సినిమాలు అక్కడ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ‘గరుడవేగ’నే బాక్సాఫీస్ లీడర్ అయింది. ఈ చిత్రం త్వరలోనే హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టబోతోంది. రాజశేఖర్ స్థాయికి ఇది చాలా పెద్ద ఫీట్ అనే చెప్పాలి.

 

Read Also : http://www.legandarywood.com/anasuya-sets-fashion-goals/

About the Author

Leave a Reply

*