‘హెరిటేజ్’ పై కలెక్షన్ కింగ్ సంచలన ‘ఆరోపణలు’ !

‘హెరిటేజ్’ పై కలెక్షన్ కింగ్ సంచలన ‘ఆరోపణలు’:

టీడీపీ అధినేత ‘చంద్రబాబు’పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు ‘హెరిటేజ్’ ఫుడ్స్ ను తనతో పాటు దాగా అనే మిత్రుడు, చంద్రబాబు కలిసి స్థాపించామని,

అధిక పెట్టుబడి తనదేనని, మిగతా ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని అన్నారు. తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని ముందుగా తన వాటాను, తదుపరి దాగాను కూడా ‘మోసం’ చేసి తరిమేశారని మోహన్ బాబు ఆరోపించారు.

 

'హెరిటేజ్' పై కలెక్షన్ కింగ్ సంచలన 'ఆరోపణలు'

‘హెరిటేజ్’ పై కలెక్షన్ కింగ్ సంచలన ‘ఆరోపణలు’

 

కొన్నేళ్ల తర్వాత తనకు హెరిటేజ్‌ సంస్థతో సంబంధం లేదనే విషయం తెలిసిందన్నారు. ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు చాలాకాలం సాగిందని గుర్తు చేశారు.

  • పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని అన్నారు.
  • ఈ కంపెనీ విషయంలో చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారని, రైతులకు తెలియకుండా వారి పేరిట హెరిటేజ్ లో వాటాలు కొని, వాటిని చూపించి ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టారని ఆరోపించారు.

తనను మోసంతో హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ… ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు సవాల్ చేశారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*