కాంగ్రెస్ ‘మేనిఫెస్టో’ సంపదలు ‘సృష్టిస్తాం’.. ప్రత్యేక ‘హోదా’ ఇస్తాం !

కాంగ్రెస్ ‘మేనిఫెస్టో’ సంపదలు ‘సృష్టిస్తాం’.. ప్రత్యేక ‘హోదా’ ఇస్తాం:

ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ తన మానిఫెస్టోని విడుదలచేసింది. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం తదితరులు హాజరయ్యారు.

మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం మాట్లాడుతూ,

 • తాము అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు । సంపదలు సృష్టిస్తామని అన్నారు.
 • ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని  హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తరువాత, ఉన్న ఉద్యోగాలు కోల్పోవటంలో మోడీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని చిదంబరం విమర్శించారు.
 • సగటున ప్రతి రైతు మీద లక్షా 4 వేల రుణభారం పెరిగిందన్నారు.

 

కాంగ్రెస్ 'మేనిఫెస్టో' సంపదలు 'సృష్టిస్తాం'

కాంగ్రెస్ ‘మేనిఫెస్టో’ సంపదలు ‘సృష్టిస్తాం’

 

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తమ మేనిఫెస్టో ఒక గదిలో కూర్చుని రూపొందించింది కాదని, ప్రజల మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా తమ మేనిఫెస్టో ఉందని వివరించారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు,

 • 2014లో రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ‘ఆంధ్ర ప్రదేశ్ కు  ప్రత్యేక హోదా’  నెరవేరుస్తామన్నారు.
 • మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి అనుమతి అవసరం ఉండదు.
 • న్యాయ్ పథకం కింద పేదల ఖాతాల్లో ఏటా రూ.72 వేలు జమ చేస్తాం.
 • అయిదేళ్లలో రూ.3.6 లక్షల చొప్పున పేదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తాం.
 • 2020 మార్చి నాటికి 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, గ్రామ పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
 • రైల్వే బడ్జెట్ మాదిరిగానే వ్యవసాయ రంగం కోసం కూడా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి, చౌకీదార్ (కాపలాదారుడు) దొంగగా మారారు.
 • ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తాం.
 • విద్య కోసం జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తాం.
 • పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం.
 • జాతీయ, అంతర్గత భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం.
 • రుణాలు ఎగ్గొట్టి విదేశాలు పారిపోయిన వారిపై చర్యలు తీసుకుంటాం, జిఎస్ టి ను సరిచేస్తాం.

 

దాదాపు ఇలాంటి ద్వారానే అధికారంలోకి వచ్చిన ‘NDA‘, తరువాత హామీలను తుంగలోకి తొక్కింది మోడీ మాయాజాలమని సీనియర్ నాయకులను అవమానపరచి బీజేపీ ని బ్రష్టు పట్టించారు నేటి పాలకులు ఇప్పుడు అదే పంథాలో అడుగులేస్తోంది కాంగ్రెస్.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*