Corona 4th Wave.. Visits soon !

‘కరోనా’ ఫోర్త్ వేవ్…’భయం’ గుప్పిట్లో దేశాలు:

ప్రపంచ జనాభాను కబళించటానికి కరోనా రూపంలో అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే దీని పుట్టిల్లైనా చైనాలో మరియు సౌత్ కొరియాలో…ఆ తీవ్రత ఆందోళనకరంగా ఉంది, అలాగే అమెరికా | బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ‘వదల బొమ్మాలి … నిన్ను వదల’ అని కొన్ని మసాలా వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చబోతున్నట్లు అంచనా…. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని తీవ్రత మునుపటికంటే ఆందోళనకరంగా ఉంటుందని సమాచారం.

వియత్నాంలోనూ వైరస్.. ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. గడిచిన వారంలో దాదాపు 20 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. చైనా | దక్షిణ కొరియా | వియత్నాంలో.. మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్‌ బీఏ.2 సబ్‌ వేరియంట్‌ కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనినే స్టెల్త్‌ ఒమిక్రాన్‌ అని పిలుస్తున్నారు. ఒరిజనల్‌ ఒమిక్రాన్ కంటే.. ఒకటిన్నర రెట్లు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది ఈ సబ్‌ వేరియంట్‌.

ఇది నేరుగా… మనిషి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చిన్నారులపైనా ఈ వేరియంట్… ప్రభావం చూపుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

భారతదేశంలో కూడా.. రాబోయే.. ఆరు నెలలు చాలా కీలకం…అనే అంచనాలతో ముందుగానే వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాగా రాబోయే..సెప్టెంబర్ మాసం నుంచి దాదాపు అయిదు నెలల కాలంలో కరోనా గట్టిగానే దెబ్బ కొడుతుందని సమాచారం.

About the Author

Leave a Reply

*