Covid Destruction @ 83 Thousand deaths in may month !
నేటి కరోనా భారతం @ ఆగని మరణాలు:
తాజాగా దేశంలో గణాంకాల ప్రకారం కోవిడ్ బారిన పడే రోగులు తక్కువ… మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, ఆసుపత్రుల దోపిడీ తో పడలేక కరోనా బాగా ముదిరాక ఆసుపత్రుల్లో జారటం హరీమని… పైసలు ఆసుపత్రుల్లో గుమ్మరించటం ఇదే నేటి భారతీయం.
అసలు విషయంలోకి వెళితే… గత 21 రోజుల్లో రికార్డు స్థాయిలో 70 లక్షల కొత్త కేసులు నమోదవడం గమనార్హం. గత నెలలో అత్యధికంగా 69.4 లక్షల కొత్త కరోనా కేసులు నమోదవగా… గడిచిన 21 రోజుల్లోనే అంతకుమించి కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఈ ఏడాది మే నెలలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. నిత్యం 4వేల పైచిలుకు మరణాలు నమోదవుతున్నాయి.
ఇప్పటివరకూ నమోదైన మొత్తం 2.62 కోట్ల పైచిలుకు కరోనా కేసుల్లో ఈ ఒక్క నెలలోనే 27శాతం కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 83,135 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ నమోదైన 3 లక్షల మరణాల్లో ఇది 28శాతం. గత ఏప్రిల్‌లో 48,768 మరణాలు మాత్రమే సంభవించాయి
శుక్రవారం ఒక్కరోజే నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 4,194మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు కరోనా .. మరో వైపు బ్లాక్ ఫంగస్, ఇప్పుడు కొత్తగా వైట్ ఫంగస్ వచ్చి చేరంది. వీటి విజృంభణ సైతం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,57,299 మందికి కొవిడ్ పాజిటివ్ తేలింది. వైరస్ బారిన పడ్డవారిలో 3,57,630మంది తాజాగా కోలుకున్నారు.
మొత్తం కేసులు: 2,62,89,290
మరణాలు: 2,95,525
మొత్తం రికవరీలు: 2,30,70,365
యాక్టివ్ కేసులు: 29,23,400.