Covid is again ready to destroy the world
Covid is again ready to destroy the world:
కరోనా మహ్మమారి ప్రపంచానికి పరిచయమైన రోజు నుంచి ప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు. మొన్న వచ్చిన కరోనా సునామి మరువక ముందే…కరోనా అప్డేటెడ్ వెర్షన్స్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది…దీని మాతృ దేశమైన చైనా లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి నాలుగేళ్ల తర్వాత మరీ ముఖ్యంగా ‘చైనా | యూరోప్ | యూస్’ దేశాల్లో మళ్లీ అదే స్థాయిలో కోరలు చాస్తుండటంతో అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమెరికా అంతటా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆందోళన వ్యక్తం చేసారు. “సెలవు రోజుల్లో ప్రజలు ప్రయాణించేటప్పుడు బాగా సరిపోయే మాస్క్ ధరించడం మంచిదని…ప్రస్తుత శ్వాసకోశ వైరస్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది” అని అలాగే కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను గృహాలకు పంపే కార్యక్రమాన్ని వైట్ హౌస్ పునఃప్రారంభిస్తోందని జోబిడెన్ ప్రకటించడం కలకలం రేపింది.
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. వారం వారీ కొత్త కోవిడ్-19 కేసుల ఏడు రోజుల సగటు గత వారం 65000 కంటే ఎక్కువకు చేరింది. ఇది మునుపటి వారంతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగడం ఆందోళనకు గురిచేస్తోంది.
డిసెంబర్ 7 నాటికి యునైటెడ్ స్టేట్స్లో 99 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 1.08 మిలియన్ మరణాలు నమోదయ్యాయని డేటా చూపించింది.
అయితే చైనాలో కూడా లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే 15 రోజులు గడవక ముందే ఒమ్రికాన్ వేరియంట్ అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీజీంగ్ సహా ప్రధాన నగారాల్లోని ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిట లాడుతున్నాయి.
ప్రజలు తమ వంతు కోసం క్యూ లైన్లలో ఆస్పత్రులు బారులు తీరుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. మరికొందరైతే జ్వరం… జలుబు… ఇతర అనారోగ్య సమస్యలతో క్లినిక్కుల ముందే సెలైన్ బాటిళ్లతో దర్శనమిస్తున్నారు. చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడం వల్లే భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని అర్థమవుతోంది.
దీనిని ఆసరా చేసుకుని కొన్ని విదేశీ శక్తులు చైనాలో ప్రజలను రెచ్చగొట్టి జీరో కోవిడ్ విధానం ఎత్తివేసేలా ప్లాన్ చేశాయని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా చైనాలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్ళీ కబళిస్తాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.