దీపికా పదుకునేతో జీవితాంతం నటిస్తానంటున్న ఇర్ఫాన్ ఖాన్ !!!

  దీపికా పదుకునేతో మరో సినిమాలో నటించనున్న ఇర్ఫాన్ ఖాన్ ‘సప్నా దీదీ’ సినిమాలో దీపికతో స్క్రీన్ పంచుకోనున్న ఇర్ఫాన్ జీవితాంతం దీపికతోనే నటించమన్నా ఎలాంటి అభ్యంతరం లేదన్న ఇర్ఫాన్ దీపికా పదుకునేతో జీవితాంతం సినిమాలు చేస్తానని బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అన్నాడు. ‘సప్నా దీదీ’ బయోపిక్‌ లో దీపికాతో మరోసారి నటించబోతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితాంతం దీపికతోనే సినిమాలు చేస్తూ ఉండటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. దీపిక చాలా అద్భుతమైన, అందమైన అమ్మాయని ప్రశంసించాడు. కాగా, ఇర్ఫాన్‌ ఖాన్ గతంలో ఆమెతో ‘పీకూ’ సినిమాలో నటించాడు. ఆ సినిమా బాలీవుడ్ ను ఆకట్టుకుంది. బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో నటించే ఇర్ఫాన్ ఖాన్ మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటించిన ‘సైనికుడు’ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు.

Read Also: http://www.legandarywood.com/vijaya-shanti-ntr-biopic-balakrishna/

About the Author

Leave a Reply

*