జేసీ మాటల్లో… లడ్డూ కావాలా నాయనా లడ్డూ !
జగన్ ఆరాటం… జేసీ హితవు:
పార్టీతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ‘నేత’, అనంతపురం ఎంపీ జేసీ ‘దివాకర్’ రెడ్డి మరోసారి సంచలన ‘వ్యాఖ్యలు’ చేశారు.
ఏపీలో కులాల పిచ్చి ఎక్కువగా ఉందని, రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నాయని… కుల పిచ్చి తగ్గితేనే రాజకీయాలు బాగుపడుతాయన్నారు. రాజకీయాల్లో ఉన్న చాలామందికి కులపిచ్చి ఎక్కువగా ఉందని, దానివల్లే రాజకీయాలు మలినమైపోతున్నాయని చెప్పారు.

జగన్ ఆరాటం… జేసీ హితవు
అది జగన్ పార్టీయా | మా పార్టీయా | వేరే పార్టీయా… అన్నది ముఖ్యం కాదు. అందరిలోను ఈ పిచ్చి కనబడుతోంది, ఈ పిచ్చి పోవాలి అని అన్నారు.
ఇంకా, జగన్ కు పగటి కలలు ఎక్కువని, తాను టీవీ లో ఒక యాడ్ చూశానని, బాబూ… లడ్డూ కావాలా నాయనా లడ్డూ ! అలా తయారైంది జగన్ పరిస్థితి. అధికారం కోసం జగన్ పడే పాట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇప్పటికైనా జగన్ పగటి కలలు కనటం మానుకోవాలని హితవు పలికారు జేసీ.
Read Also: https://www.legandarywood.com