E-pass request for Sex @innovative Thoughts !

సమయం లేదు సెక్స్ కోసం వెళ్ళాలి ఈ-పాస్ ఇవ్వండి:

కరోనా పుణ్యమా అని దాదాపు అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులు మూసేస్తున్నారు… ఈ పాస్ ఉంటే కానీ అనుమతించటం లేదు… తాజాగా కేరళలోని ఒక వ్యక్తి ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ అభ్యర్థన సారాంశం ఏమిటంటే…ఇంట్లో ఉండలేకపోతున్నాను.పిచ్చెక్కినట్టుగా అవుతుంది. శృంగార కోసం బయటకు వెళ్లాలనుకుంటున్నాను… దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్యక్తి పోలీసుల్ని కోరాడు.

కన్నూరులోని ఇరినేవ్ గ్రామ స్థానికుడు ఈ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు… అప్లికేషన్ పెట్టిన ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

వాలాపట్టణం పోలీసులు అతన్ని శ్రీ కృష్ణ జన్మస్థానం కు తరలిస్తుంటే… అక్షర దోషం వల్ల తన అప్లికేషన్‌లో పొరపాటు జరిగినట్లు సదరు వ్యక్తి పోలీసులకు క్షమాపణ చెప్పాడు. ఇంగ్లీషులో “six o clock” అని రాయాలని అనుకున్నానని, కానీ తన దరఖాస్తులో పొరపాటున “sex” అని పడినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి క్షమాపణలను స్వీకరించిన పోలీసులు… అనవసర కారణాలతో ఈ-పాస్ దరఖాస్తు చేసుకోవద్దు అంటూ అతన్ని రిలీజ్ చేశారు.

బీహార్‌లోనూ ఓ వ్యక్తి కూడా చిత్రమైన కారణం చూపుతూ… ఈ-పాస్ ఇవ్వాలని కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని, ఆ అకతాయికి సరైన బుద్ధి చెప్పిన విషయం తెల్సిందే.

మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన పొరపాటు… ఇతరులకు ఇబ్బంది కలగరాదు. “stay home and be safe”.

About the Author

Leave a Reply

*