Extramarital affair killed : ప్రియుడిని ఫ్రెండ్‌తో హత్య చేయించిన వివాహిత
facebook friendship killed : హైదరాబాద్ మీర్ పేట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మీర్‌పేట్ ప్రశాంతి హిల్స్‌లో వివాహేతర సంబంధం ఓ యువకుని హత్యకు దారితీసింది. ఘటనలో నిందితురాలు శ్వేతా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యశ్విన్ అనే యువకుడితో శ్వేతా రెడ్డికి 2018లో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. వృత్తి రీత్యా యశ్విన్ ఫోటోగ్రఫర్. చనువు పెరిగి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రేమలో మునిగిపోయానని, నెలలో తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతా రెడ్డిని డిమాండ్ చేయసాగాడు. పెళ్లి చేసుకోకపోతే తనతో సన్నిహితంగా ఉన్న నగ్న విడియోలు, ఫోటోలను అందరికీ పంపుతానని, నెట్‌లో షేర్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు.
దీంతో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అశోక్ అనే వ్యక్తితో యశ్విన్‌ను చంపించాలని ప్లాన్ చేసింది. కృష్ణా జిల్లా తిరువూరు మండలానికి చెందిన అశోక్, శ్వేతా రెడ్డి కలిసి అదను చూసి యశ్విన్‌ను మట్టుబెట్టారు.
ఈనెల 4వ తేదీన అశోక్ మరో వ్యక్తి కార్తిక్‌తో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అదే రాత్రి యశ్విన్‌ను ప్రశాంతి హిల్స్‌కు రమ్మని చెప్పి పిలిపించింది. అర్థరాత్రి సమయంలో వెనుక నుండి యశ్విన్ తలపై 2-3సార్లు మోది హత్య చేశారు. రోడ్ యాక్సిడెంట్‌గా చిత్రించి ఆస్పత్రిలో చేర్పించారు. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతోనే శ్వేతారెడ్డి ఈ హత్య చేయించిందని తెలుస్తోంది.